Hyderabad, మే 9 -- ఓటీటీలో ఈ వారం చాలా వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో నిన్న (మే 8) ఒక్కరోజే 9 వరకు మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వాటిలో రెండు సినిమాలు ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే, అవి రెండు కూడా తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవడం విశేషం.

ఇక వాటిలో ఒకటి బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా చేసింది. అలాగే, ప్రియా ప్రకాష్ వారియర్, అర్జున్ దాస్, షైన్ టామ్ చాకో వంటి పాపులర్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను రూ. 270 నుంచి 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలై...