Hyderabad, ఆగస్టు 2 -- ఓటీటీలోకి వచ్చిన అన్ని సినిమాలు మంచి ఆదరణ దక్కించుకోవు. థియేటర్లలో సూపర్ హిట్, డిజాస్టర్, ఫ్లాప్ టాక్ ఇలా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకున్న ఓటీటీలో మాత్రం వాటి ఫలితాలు కాస్తా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక ఓటీటీల్లో ప్రతివారం కుప్పలుతెప్పలుగా సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి.

అలా ఆగస్ట్ 1 శుక్రవారం అనేక ఓటీటీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీనే గార్డ్: రివేంజ్ ఫర్ లవ్. ఈ ఏడాది తెలుగులో వచ్చిన గార్డ్ సినిమాలో విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్ హీరో హీరోయిన్లుగా నటించారు.

గార్డ్ మూవీకి జగ్గా పెద్ది దర్శకత్వం వహించారు. అనసూయ రెడ్డి నిర్మించారు. ఫిబ్రవరి 28న అత్యధిక థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా గార్డ్: రివేంజ్ ఫర్ లవ్ మూవీ రిలీజ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మం...