Hyderabad, ఆగస్టు 10 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు న్యూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. వాటిలో ఎంత ఫ్రెష్ కంటెంట్ ఉందో చూసిన ఓటీటీ ఆడియెన్స్ చెబుతారు. అయితే, ప్రతివారం ఎన్నో సినిమాలు, సిరీసులు ఓటీటీ రిలీజ్ అయినప్పటికీ కొన్ని మాత్రమే పేరు తెచ్చుకుని ట్రెండింగ్‌లోకి వస్తుంటాయి.

అలా రీసెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు రూరల్ బ్యాక్ డ్రాప్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. యూట్యూబ్‌లో మై విలేజ్ షో సిరీస్‌తో ఎంతో పేరు తెచ్చుకున్న అనిల్ గీలా హీరోగా నటించిన తొలి ఓటీటీ సిరీస్ ఇది.

అనిల్ గీలాకు జోడీగా వర్షిణి రెడ్డి జున్నుతుల హీరోయిన్‌గా ఈ సిరీస్‌లో నటించింది. మోతెవరి లవ్ స్టోరీ వెబ్ సిరీస్‌కు శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించ...