Hyderabad, ఆగస్టు 16 -- ఈ సంవత్సరం అనగనగా, ఎయిర్ లాంటి ఒరిజినల్స్‌తో వరుస విజయాలు సాధించి తమ ప్రతిభ చాటుకున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్. తాజాగా మరో వైవిధ్యభరితమైన ఒరిజినల్ కంటెంట్‌తో ఈటీవీ విన్ ఓటీటీ వచ్చింది. ఈసారి సస్పెన్స్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈటీవీ విన్ ఓటీటీ.

ఇలా వరుసగా కంటెంట్ అందించడంతో సౌత్ ఇండియాలో చురుకుగా కొత్త ఒరిజినల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఓటీటీ స్పేస్‌లో క్రియాశీలకంగా మారుతోంది ఈటీవీ విన్. ఇకపోతే బ్యూటిఫుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో మెప్పించిన ఓటీటీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం.

ఈ గురువారం (ఆగస్టు 14) అర్ధరాత్రి నుంచి ఈటీవీ విన్‌లో కానిస్టేబుల్ కనకం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన తొలిరోజు నుంచే ఈటీవీ విన్ ట్రెండ...