భారతదేశం, నవంబర్ 11 -- ఓటీటీలు వచ్చాక ఏ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమా ఓటీటీకి వచ్చాక యావరేజ్‌ టాక్ తెచ్చుకుంటున్నాయి. కానీ, థియేటర్లలో ఫ్లాప్‌గా నిలిచిన సినిమాలు మాత్రం ఓటీటీలో సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటాయి.

ఇలా థియేటరల్లో ఫ్లాప్‌గా.. ఓటీటీల్లో హిట్‌గా నిలిచే సినిమాలే ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి ఓ తెలుగు క్రైమ్ కామెడీ మూవీనే ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. ఆ సినిమా మరేదే కాదు మిత్ర మండలి.

నిర్మాత బన్నీ వాస్ సమర్పణలో బీవీ వర్క్స్, సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్స్‌పై విజయేందర్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మిత్ర మండలి'. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ హీరో హీరోయిన్లుగా జంటగా నటిస్తూ వెండి తెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

కల్యాణ్ మంతెన, భాను ప్ర...