Hyderabad, ఆగస్టు 6 -- ఓటీటీలో ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రతి వారం స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓటీటీలోకి తమిళ కోర్ట్ రూమ్ డ్రామా వెబ్ సిరీస్ సట్టముమ్ నీతియుమ్ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఈ సిరీస్‌లో తమిళ పాపులర్ నటుడు శరవణన్ ప్రధాన పాత్ర పోషించారు.

18 క్రియేటర్స్ బ్యానర్ మీద ఈ వెబ్ సిరీస్‌ను శశికళ ప్రభాకరణ్ నిర్మించారు. షో రన్నర్‌‌గా సూర్య ప్రతాప్ ఎస్ వ్యవహరించారు. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన సట్టముమ్ నీతియుమ్ తెలుగులో కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. రీసెంట్‌గా జీ5లో సట్టముమ్ నీతియుమ్ ఓటీటీ రిలీజ్ అయింది.

జీ5లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సట్టముమ్ నీతియుమ్ సిరీస్‌కు ఐమ్‌డీబీ నుంచి 6.9 రేటింగ్ సొంతం చేసుకుంది. అలాగే, జీ5 ఓటీటీలో ఈ సిరీస్ మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో దూసుకుప...