Hyderabad, జూలై 9 -- ఓటీటీలోకి ఈమధ్యే వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ (AIR). ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ఇది. జులై 3 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కోర్ట్ మూవీ ఫేమ్ రోషన్ లీడ్ రోల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆరు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది.

ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ గత వారం అంటే జులై 3న ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అంతకుముందే అనగనగా ఒరిజినల్ మూవీతో మంచి హిట్ అందుకున్న ఈ ఓటీటీకి ఈ ఆల్ ఇండియా ర్యాంకర్స్ రూపంలో మరో హిట్ దక్కింది. ఈ సిరీస్ ఆరు రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకున్నట్లు ఆ ఓటీటీ బుధవారం (జులై 10) వెల్లడించింది.

"ర్యాంకు కాదు.. ర్యాంపు అంటాము.. 100 మిలియన్ ప్లస్ స్ట్రీమ్స్, కౌంటి...