Hyderabad, ఏప్రిల్ 30 -- ఓటీటీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ తెలుగు సహా ఎన్నో భాషలకు చెందిన ఎన్నో వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. అయితే కన్నడ నుంచి మాత్రం ఈ మధ్య తొలి వెబ్ సిరీస్ వచ్చింది. అది కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో కావడం విశేషం. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఐదు రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది.

కన్నడలో రూపొందిన తొలి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు అయ్యన మనె. అంటే అయ్యన ఇల్లు అని అర్థం. ఈ సిరీస్ ఏప్రిల్ 25న జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. తొలి ఐదు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు సొంతం చేసుకుంది. రమేష్ ఇందిర డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్ల పాటు సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ కేవలం 18 నుంచి 20 నిమిషాలే ఉండటం గమనార్హం.

ఈ సిరీస్ స్ట్రీమింగ్ మొద...