Hyderabad, మే 3 -- ఓటీటీలో వచ్చే సినిమాల్లో ఆడియెన్స్‌కు నచ్చే జోనర్స్‌లో క్రైమ్ థ్రిల్లర్స్ ఒకటి. మంచి ట్విస్టులు, ఊహించని థ్రిల్లింగ్ సీన్లతో తెరకెక్కిస్తే వాటికి మంచి ఆదరణ వస్తుంటుంది. అయితే, ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఓటీటీలో మంచి పేరు తెచ్చుకుంటాయి.

ఇప్పుడు అలాగే, ఓటీటీలో దుమ్ములేపుతోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గరుడ 2.0. సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం అంటే 2016లో ఫ్రిబ్రవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. అయితే, ఈ సినిమా తమిళంలో ఆరతు సినమ్ అనే టైటిల్‌తో ముందుగా రిలీజ్ అయింది.

తమిళంలో ఆరతు సినమ్ మంచి హిట్ కొట్టింది. అలాగే, అదిరిపోయే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద ఆరతు సినమ్ మంచి విజయం సాధించింది. అయితే ఐఎమ్‌డీబీ నుంచి ఆరతు సినమ్ 6.8 రేటింగ్ సాధించుకుంది. అలాంటి ఆరతు సినమ్ తొమ్మిదేళ్లక...