భారతదేశం, జనవరి 10 -- కొన్ని సినిమాలు ఉంటాయి.. థియేటర్లలో ఎవరూ పట్టించుకోకపోయినా ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అనూహ్యంగా దూసుకెళ్తుంటాయి. అలాంటిదే ఆది పినిశెట్టి లీడ్ రోల్లో నటించిన థ్రిల్లర్ మూవీ డ్రైవ్. ఇప్పుడీ సినిమాకు ప్రైమ్ వీడియోలో మంచి ఆదరణ లభిస్తోంది. మరి ఆ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.

ఆది పినిశెట్టి లీడ్ రోల్లో నటించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డ్రైవ్ (Drive). ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో తొలి స్థానంలో ఉంది. ఓటీటీలోకి అడుగుపెట్టినప్పటి నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇందులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రష్మిక మందన్న నటించిన హారర్ కామెడీ థామాను కూడా వెనక్కి నెట్టి ఈ డ్రైవ్ నంబర్ 1 స్థానంలోకి దూసుకెళ్లింది. విచిత్రమేమిటంటే...