భారతదేశం, ఏప్రిల్ 26 -- తమిళ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా నటించిన 'వీర ధీర శూరన్ పార్ట్ 2' సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిలర్ మూవీకి ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. పార్ట్ 1 కంటే ముందు ఈ మూవీ పార్ట్ 2 వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా చాలా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. మంచి వసూళ్లను సాధించింది. ఈ వీర ధీర శూరన్ చిత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. స్ట్రీమింగ్‍లో అదగొడుతోంది.

వీర ధీర శూరన్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ సత్తాచాటుతోంది. భారీ వ్యూస్‍తో దుమ్మురేపుతోంది. దీంతో ఈ సినిమా ప్రస్తుతం (ఏప్రిల్ 26) ప్రైమ్ వీడియో ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చేసింది. ఈ మూవీ ఈ గురువారం ఏప్రిల్ 24న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ అందుబాటులోకి వచ్చింది....