భారతదేశం, మే 11 -- తెలుగు సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా ఓదెల 2 మొదటి నుంచి మంచి హైప్ దక్కించుకుంది. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా లీడ్ రోల్ చేసిన ఈ మూవీ చాలా అంచనాలతో ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‍లో పర్ఫామ్ చేయలేకపోయింది. సీక్వెల్ క్రేజ్, సంపత్ నంది బ్రాండ్ వర్కౌట్ కాలేదు. అయితే, ఓటీటీలో మాత్రం ఓదెల 2 ప్రస్తుతం అదరగొడుతోంది.

ఓదెల 2 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రస్తుతం నేషనల్ వైడ్ సినిమాల ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. ఈ మూవీ మే 8వ తేదీన ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మూడు రోజుల్లోనే ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల విభాగంలో అగ్రస్థానానికి ఓదెల 2 దూసుకొచ్చేసింది.

మొదటి నుంచే ప్రైమ్ వీడియోలో ఓద...