Hyderabad, జూలై 4 -- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన ది హంట్: ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్ (రాజీవ్ గాంధీ హత్య కేసు) అనేది ఒక నిజమైన పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. సోనీ లివ్‌లో తెలుగులో ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సిరీస్ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత 90 రోజుల పాటు జరిగిన గాలింపు చర్యల కథాంశంగా సాగుతుంది. 1991 ఆత్మాహుతి దాడికి బాధ్యులైన వారిని గుర్తించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) చేసిన ప్రయత్నాలను చూపిస్తుంది. మరి ఇలాంటి నిజ సంఘటనలతో తెరకెక్కిన ది బెస్ట్ 5 ఓటీటీ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్స్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ లుక్కేయండి.

ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం, భారత్-పాక్ విభజన, అందులో రాజకీయ నే...