Hyderabad, జూలై 27 -- ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కుప్పలుతెప్పలుగా సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతోపాటు డిజాస్టర్ మూవీస్ కూడా ఉంటాయి. అయితే, కొన్ని సినిమాలు థియేటర్లలో అంతగా ఆదరణకు నోచుకోవు. కానీ, ఓటీటీలో మాత్రం సత్తా చాటుతుంటాయి.

అలాంటి సినిమానే చౌర్య పాఠం. తెలుగులో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన చౌర్య పాఠం ఓటీటీలో దంచికొడుతోంది. ప్రశాంతమైన ఓ చిన్న గ్రామంలో నలుగురు బ్యాంక్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించే పనులతో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీల అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

చౌర్య పాఠం సినిమాలో ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు మస్తీ అలీ, సుప్రియ ఐసోల, రాజీవ్ కనకాల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. చౌర్య పాఠం సినిమాతో నిఖిల్ గొల్లమారి...