Hyderabad, సెప్టెంబర్ 29 -- ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. హారర్, కామెడీ, బోల్డ్ జోనర్స్‌పై ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలకు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. ఎలాంటి జోనర్‌కు అయిన థ్రిల్లింగ్ సీన్స్, అదిరిపోయే ట్విస్టులు యాడ్ చేసి తెరకెక్కిస్తే అవి మంచి హిట్ అందుకుంటాయి.

అయితే, కొన్నిసార్లు అవి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా మిగిలి ఓటీటీ రిలీజ్ తర్వాత మాత్రం మంచి హైప్ తెచ్చుకుంటాయి. అలాంటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించే ఇక్కడ చెప్పుకునేది. ఈ సినిమా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మూవీలోని సీన్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి ఆ సినిమాను ఓటీటీ సజెషన్ కింద లుక్కేయండి.

ఇంతకీ ఆ మూవీ పేరు గాడ్. తమిళంలో తెరకెక్కిన ఇరైవన్ సినిమాను తెలుగు...