భారతదేశం, ఆగస్టు 27 -- తమిళ సూపర్ హిట్ కామెడీ ఎమోషనల్ డ్రామా 'మామన్' ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇవాళ (ఆగస్టు 27) నుంచి ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. వినాయక చవితి సందర్భంగా ఈ తమిళ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ చేశారు.

తమిళ కామెడీ ఎమోషనల్ మూవీ మామన్ ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా బుధవారం నుంచి జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇన్ని రోజులు తమిళంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ ఆడియన్స్ ను అలరిస్తోంది.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఫ్యామిలీ కామెడీ డ్రామా మే 16, 2025న థియేటర్లలో రిలీజైంది. ఆగస్టు 8న తమిళంలో జీ5లో మామన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ...