Hyderabad, జూన్ 30 -- మిస్టరీ థ్రిల్లర్ స్టోరీకి కాస్త కామెడీని కూడా జోడించి ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్ మిస్త్రీ (Mistry). ఈ హిందీ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఓసీడీ (ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్)తో బాధపడుతూ సస్పెన్షన్ కు గురయ్యే ఓ పోలీస్ ఆఫీసర్ పరిష్కరించే వివిధ కేసుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

మిస్త్రీ వెబ్ సిరీస్ అర్మాన్ మిస్త్రీ (రామ్ కపూర్) అనే ఓ మాజీ పోలీస్ ఆఫీసర్, అతడు చిటికెలో పరిష్కరించే కేసుల చుట్టూ తిరుగుతుంది. తన కళ్ల ముందే ఓ బాంబు పేలుడులో తన భార్య మరణించడంతో ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) బారిన పడతాడు. ఓవైపు తన భార్య హత్యకు కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయడంతోపాటు కఠినమైన కేసులను పరిష్కరించడంలో పోలీస్ డిపార్ట్‌మెంట్ కు కన్సల్టెంట్ గా పని చేస్తుంటాడు.

ఓసీడీ.. అంటే చేసిన పనిన...