భారతదేశం, మే 1 -- భీమ్లానాయ‌క్, విరూపాక్ష సినిమాల ఫేమ్‌ సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ బూమ్‌రాంగ్ తెలుగులోకి వ‌చ్చింది. ఈ బోల్డ్ థ్రిల్ల‌ర్ మూవీ డైరెక్ట్‌గా సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌ల‌యాళ , త‌మిళ భాష‌ల్లో కూడా సైనా ప్లే ఓటీటీలోనే ఈ మూవీ అందుబాటులో ఉంది. బూమ్‌రాంగ్ మూవీలో దేవ‌ర ఫేమ్ షైన్ టామ్ చాకో, చెంబ‌న్ వినోద్ జోస్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ‌ను సుధాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2023లో థియేట‌ర్ల‌లో రిలీజైన బూమ్‌రాంగ్ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఔట్‌డేటెడ్ కామెడీ, కాన్సెప్ట్ కార‌ణంగా ప్రేక్ష‌కుల తిర‌స్కారానికి గురైంది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీకి 3.4 రేటింగ్ మాత్ర‌మే వ‌చ్చింది. క‌లెక్ష‌న్స్ విష‌యంలో నిర్మాత‌ల‌కు బూమ్‌రాంగ్ మూవీ న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. కోటిలోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది.

రిలీజ్ ...