భారతదేశం, మే 17 -- స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషించిన ఓదెల 2 సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. థియేట్రికల్ రన్‍లో ప్లాఫ్ అయినా.. ఓటీటీలో సత్తాచాటుతోంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా ఏప్రిల్ 17వ తేదీన థియేటర్లలో రిలీజైంది. సంపత్ నంది కథ, పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్లలో నిరాశపరిచింది. అయితే, గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓదెల 2 మంచి వ్యూస్ సాధిస్తోంది. ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రానికి మరింత బూస్ట్ దక్కింది. అదేంటంటే..

ఓదెల 2 సినిమా నేడు (మే 17) కన్నడ, మలయాళం వెర్షన్లు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. ఈ సినిమా గత వారం మే 8వ తేదీన ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందు ఐదు భాషలు అని ప్రకటించినా.. ఆరోజున తెలుగుతో పాటు తమిళం, హిందీలోనే స్ట్రీమింగ్‍కు తెచ్చింది ప్రైమ్ వ...