భారతదేశం, జూన్ 14 -- థియేటర్లలో ఆడియన్స్ ను మెప్పించి.. ఓటీటీలోకి దూసుకొచ్చిన శుభం మూవీ అదరగొడుతోంది. రిలీజైన ఒక్క రోజులోనే ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఆడియన్స్ ను అలరిస్తోంది.

థియేటర్లలో మే 9న రిలీజైన శుభం సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ లైన్, కొత్త యాక్టర్ల యాక్టింగ్ ఆడియన్స్ ను అలరించింది. కామెడీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన శుభం మూవీ జూన్ 13న ఓటీటీలో అడుగుపెట్టింది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో శుభం మూవీ ఓటీటీలో అలరిస్తోంది.

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో శుభం ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది. తెలుగులో టాప్ ప్లేస్ లోకి వచ్చేసింది. నవ్విస్తూనే భయపెట్టే ఈ మూవీ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తెలుగులో చ...