భారతదేశం, నవంబర్ 24 -- ఓటీటీలో ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తాయి. అలాంటి కొన్ని వారాలుగా కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార ఛాప్టర్ 1 టాప్ లోనే కొనసాగుతోంది. మరి టాప్ 5లో ఉన్న ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం.

ఓటీటీలో ప్రతివారం ఎక్కువ వ్యూస్ పొందే సినిమాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గతవారం అంటే నవంబర్ 17 నుంచి 23 వరకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ప్రేక్షకులు ఆదరించిన సినిమాల లిస్టును సోమవారం (నవంబర్ 24) రిలీజ్ చేశారు.

ఇందులో కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార ఛాప్టర్ 1 తొలి స్థానంలో ఉంది. గతవారం 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక రెండో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న డ్యూడ్ 2.4 మిలియన్ వ్యూస్ తో నిలిచింది.

మూడో స్థానంలో హారర్...