భారతదేశం, డిసెంబర్ 29 -- ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ (Ormax) గత వారం అంటే డిసెంబర్ 22 నుంచి 28 మధ్య అత్యధిక వ్యూస్ సాధించిన టాప్-5 ఓటీటీ సినిమాల లిస్టును విడుదల చేసింది. ఇందులో రష్మిక మందన్న నటించిన రెండు, భాగ్యశ్రీ బోర్సే నటించిన రెండు సినిమాలు ఉండటం విశేషం. హారర్ కామెడీ 'థామ' టాప్ ప్లేస్ లో నిలవగా, 'ది గర్ల్‌ఫ్రెండ్' కూడా లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.

ఈ ఏడాది చివరలో ఓటీటీ ఆడియెన్స్ ఏ సినిమాలను ఎక్కువగా చూశారో తెలుసా? ఈ వారం ఆర్మాక్స్ రిలీజ్ చేసిన టాప్ 5 లిస్ట్ ఇక్కడ ఉంది. వీటిలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నవే నాలుగు సినిమాలు ఉండటం విశేషం. మరొకటి ప్రైమ్ వీడియోలో ఉంది.

ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన హారర్ కామెడీ సినిమా థామా ఓటీటీని షేక్ చేస్తోంది. కేవలం ఒకే వారంలో 35 లక్షల వ్యూస్ సొంతం చేస...