భారతదేశం, మే 25 -- ది డిప్లొమాట్ చిత్రం మార్చి 14వ తేదీన థియేటర్లలో రిలీజై మంచి హిట్ సాధించింది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు జాన్ అబ్రహాం ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ థియేట్రికల్ రన్‍తో సక్సెస్ అయింది. ఇప్పుడు ఓటీటీలోనూ ది డిప్లొమాట్ అదరగొడుతోంది.

ది డిప్లొమాట్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో భారీ వ్యూస్ సాధిస్తోంది. మే 9వ తేదీన ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. స్ట్రీమింగ్ తర్వాత కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. దీంతో వ్యూస్ కూడా క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ది డిప్లొమాట్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ నాన్-ఇంగ్లిష్ సినిమాల లిస్టులో గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతోంది.

నెట్‍ఫ్లిక్స్ నాన్ ఇంగ్లిష్ సినిమాల గ్లోబల్ ట్రెండింగ్‍ లిస్టులో ప్రస్తుతం (మే 25) నాలుగో స్థానానికి ది డిప్లొమ...