భారతదేశం, నవంబర్ 24 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చీ రాగానే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 తన దూకుడు మొదలుపెట్టింది. తొలి మూడు రోజుల్లోనే టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాలో తొలి స్థానానికి దూసుకెళ్లింది. తాజాగా సోమవారం (నవంబర్ 24) ఆర్మాక్స్ మీడియా ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 వెబ్ సిరీస్ జాబితా రిలీజ్ చేసింది.

ఓటీటీలో గత వారం అంటే నవంబర్ 17 నుంచి 23 మధ్య ఏ వెబ్ సిరీస్ కు ఎక్కువ వ్యూస్ వచ్చాయో తెలుసా? ఊహించినట్లే నాలుగేళ్ల తర్వాత మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దుమ్ము రేపింది. తొలి మూడు రోజుల్లోనే ఈ కొత్త సీజన్ కు ఏకంగా 6.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇది ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది.

రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్రైమ్ సీజన్ 3కి 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మూ...