భారతదేశం, నవంబర్ 6 -- క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ కు ఓటీటీలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో తాజాగా జీ5 ఓటీటీలోకి వచ్చిన మూవీ నిరూపిస్తోంది. జీ5 ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు భాగవత్ ఛాప్టర్ 1 రాక్షస్. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది.

అర్షద్ వార్సీ లీడ్ రోల్లో నటించిన భాగవత్ ఛాప్టర్ 1 రాక్షస్ మూవీ 250 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది. గురువారం (నవంబర్ 6) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. "చేజ్ కొనసాగుతోంది.. అలాగే వ్యూస్ కూడా.. భాగవత్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. మూడు వారాలైనా ఇంకా దూసుకెళ్తూనే ఉందంటూ లేటెస్ట్ పోస్టర్ పై క్యాప్షన్ ఉంచింది. 25 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అంటే చా...