భారతదేశం, ఆగస్టు 16 -- రజనీకాంత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ' (Coolie) బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. థియేటర్లలో కలెక్షన్ల ఊచకోతకు దిగింది. వసూళ్లలో కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది కూలీ. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ బజ్ నెలకొంది.

కూలీ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది. అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన తమిళ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. కూలీ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు ప్రైమ్ వీడియో దక్క...