భారతదేశం, జూలై 5 -- మంచి కంటెంట్ తో డిఫరెంట్ సినిమాలు, సిరీస్ లను అందిస్తోంది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్. ఇంటిల్లిపాది కలిసి చూసేలా మన కథలనే తీసుకుని తెరకెక్కిస్తోంది. ఇప్పుడు అలాంటి వెబ్ సిరీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. కామెడీ అందిస్తూనే ఏడిపిస్తోంది. అందరినీ తమ ఇంటర్ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్తోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్)'. ఓటీటీలో ఈ సిరీస్ సత్తాచాటుతోంది.

ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) వెబ్ సిరీస్ ను ఏడు ఎపిసోడ్లుగా తీసుకొచ్చారు. గురువారం (జూలై 3) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంటర్ చదివే ముగ్గురు కుర్రాళ్ల కథగా ఈ సిరీస్ తీసుకొచ్చారు. ఇంటర్లో కుర్రాళ్లు చేసే కామెడీ, హాస్టల్ లైఫ్, ర్యాంకుల కోసం పేరేంట్స్, మేనేజ్ మెంట్ ప్రెషర్ తదితర అంశాలతో ఈ సిరీస్ ను రూపొందించారు.

ఈటీ...