భారతదేశం, అక్టోబర్ 29 -- కల్కి 2898 AD సీక్వెల్ నుంచి దీపికా పదుకొణెను తప్పించడంతో మొదలైన వివాదానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ పడేలా లేదు. కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే బుధవారం (అక్టోబర్ 29) స్ట్రీమింగ్‌లో ఉన్న సినిమా ఎండ్ క్రెడిట్స్‌లో దీపికా పేరు మిస్సయింది. ఈ విషయాన్ని అభిమానులు గమనించారు. దీంతో మరోసారి కల్కి, దీపికా కాంట్రవర్సీ హాట్ టాపిక్ గా మారింది.

కల్కి 2898 ఏడీ పోస్టర్ లో ఉన్న ముగ్గురు ముఖాలలో దీపికా పదుకొణె ఒకరు. ప్రభాస్, అమితాబ్ తో పాటు దీపికా ఫొటో ఉంది. అలాంటిది మూవీ క్రెడిట్స్ లో దీపికా పేరు లేకపోవడం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఎడిట్ చేసిన ఎండ్ క్రెడిట్స్ వీడియోలు, స్క్రీన్‌గ్రాబ్‌లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అభిమానులు దీపికాకు మద్దతుగా నిలిచి, చిత్ర నిర్మాతలను 'అన్‌ప్రొఫెషనల్‌' అని విమర్శిస్తున్...