Hyderabad, మే 16 -- సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే కథతో వచ్చిన డార్క్ కామెడీ మూవీ మరణమాస్ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే మలయాళంలో ఇలా కామెడీ కాకుండా సీరియస్ గా సాగే సీరియల్ కిల్లర్ సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో బెస్ట్ మూవీస్ ఏవి? వాటిని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడాలో తెలుసుకోండి.

మలయాళ స్టార్ నటుడు కుంచకో బొబన్ నటించిన మూవీ ఈ అంజామ్ పతీరా. సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అయితే మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో యూట్యూబ్ లోనూ ఉంది. పోలీస్ ఆఫీసర్లను లక్ష్యంగా చేసుకొని చంపే ఓ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి అన్వర్ హుస్సేన్ (కుంచకో బొబన్) అనే క్రిమినాలజిస్ట్ సాయం తీసుకుంటారు పోలీసులు. అతడు ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడన్నది ఈ సినిమాలో ఆసక్తికర పాయింట్.

జోషి డైరెక్ట్ చేసిన ఈ పాప్పన్ మూవీలో...