Hyderabad, జూలై 15 -- అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపీ నటించిన మలయాళం కోర్ట్ రూమ్ డ్రామా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. టైటిల్‌పై సుదీర్ఘ న్యాయ వివాదం తర్వాత ఈ సినిమా జులై 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విడుదలకు ముందు, కోర్టురూమ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఇతర మలయాళ మూవీస్ 'నేరు' 'న్నా థాన్ కేస్ కొడు' వంటివి పరిశీలిద్దాం.

కొన్ని సినిమాలు కామెడీతో కూడిన లోతైన విషయాలను ప్రస్తావిస్తాయి. మరికొన్ని అద్భుతమైన నటనలతో గంభీరమైన కథనంతో సాగుతాయి. మరి అనుపమ మూవీ రిలీజ్ కు ముందే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఈ సినిమాలు చూసేయండి.

లైంగిక దాడి ఘటన తర్వాత న్యాయం కోసం పోరాడే ఓ అంధురాలైన శిల్పి సారా కథ ఈ నేరు సినిమాకు ప్రధానాంశం. పదేళ్ల తర్వాత, మోహన్‌లాల్ ఈ సినిమాలో ఒక లాయర్‌గా నటించాడు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ కోర్టురూమ్ డ్రామా 'నేరు' బాక్సాఫీస్ ...