Hyderabad, జూన్ 12 -- టాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర కథానాయకుడిగా, విలన్‌గా, నటుడిగా అనేక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఎక్కువగా ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్స్‌తో ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు.

అయితే, అలాంటి హీరో నవీన్ చంద్ర నటించిన మూడు సినిమాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. వాటిలో రెండు తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుండగా.. మరొకటి థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

నవీన్ చంద్ర హీరోగా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన మూవీ అందాల రాక్షసి. ఈ సినిమాతో హీరోలుగా నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి, డైరెక్టర్‌గా హను రాఘవపూడి...