భారతదేశం, డిసెంబర్ 10 -- ఓటీటీ ఆడియన్స్ కోసం అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ ను తెచ్చేస్తోంది పాపులర్ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌. 2026లో స్ట్రీమింగ్ చేసే జియోహాట్‌స్టార్‌ స్పెషల్ సినిమాలు, సిరీస్ లు, షోల వివరాలను జియోహాట్‌స్టార్‌ ప్రకటించింది. జియోహాట్‌స్టార్‌ సౌత్ అన్ బౌండ్ పేరుతో నిర్వహించిన ఈవెంట్లో వచ్చే ఏడాది సౌత్ లో రాబోతున్న సినిమాలు, సిరీస్ లు, షోల టైటిల్స్ ను అనౌన్స్ చేసేసింది.

జియోహాట్‌స్టార్‌ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2026లో వచ్చే తమ స్పెషల్ సినిమాలు, సిరీస్ లు, షోల లిస్ట్ ను మంగళవారం (డిసెంబర్ 9) రాత్రి ఈవెంట్లో ప్రకటించేసింది. ఇందుకోసం జియోహాట్‌స్టార్‌ సౌత్ అన్ బౌండ్ ఈవెంట్ నిర్వహించింది. దీనికి నాగార్జున, మోహన్ లాల్, విజయ్ సేతుపతి తదితర స్టార్లు హాజరయ్యారు. ఇక్కడ జియో...