Hyderabad, జూలై 15 -- సంజయ్ దత్, మౌనీ రాయ్ నటించిన హారర్ కామెడీ మూవీ 'ది భూత్ని' డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. మే నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు Z5 ఓటీటీ ద్వారా అందుబాటులోకి రానుంది. భయానక అంశాలు, వినోదాత్మక కథనంతో నిండిన 'ది భూత్ని' ఈ వీకెండ్ లో చూడటానికి బెస్ట్ ఛాయిస్. జులై 18న ఓటీటీలోకి రానుందీ మూవీ. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే అందుబాటులో ఉన్న హారర్ కామెడీ సినిమాలను చూసేయండి.

ముంజ్యా ఓ మంచి హారర్ కామెడీ సినిమా. జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించిన ఒక యువకుడు ప్రతీకారం తీర్చుకునే ఆత్మను, కొన్ని భయంకరమైన కుటుంబ రహస్యాలను వెలికితీయడాన్ని చూపిస్తుంది. అభయ్ వర్మ, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించగా, సత్యరాజ్, మోనా సింగ్ కూడా కీలక పాత్ర...