భారతదేశం, ఏప్రిల్ 26 -- పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చేశాయి. దీంతో ఈ హాలీడేస్‍లో పిల్లలతో ఏమేం చేయించాలనే ఆలోచనలో పెద్దలు ఉంటారు. కొత్త విషయాలను నేర్పించాలనుకుంటారు. ఈ క్రమంలో పిల్లలకు కొన్ని మంచి సినిమాలు చూపించడం వల్ల వారిలో విలువలు, పాజిటివిటీ పెరుగుతాయి. అందులోనూ యానిమేషన్ చిత్రాలంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. సినిమా ద్వారా పిల్లలకు మంచి విషయాలు తెలియాలనుకుంటే 'ఫైండ్ నెమో' (Finding Nemo) పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. 2003లో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ సాధించింది. సముద్రంలోని జీవులతో ఈ యానిమేషన్ చిత్రం సాగుతుంది. పిల్లలందరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలి. ఎందుకో 5 కారణాలు తెలుసుకోండి. ఓ ఓటీటీలో ఉందో కూడా చూడండి.

ఫైండింగ్ నెమో సినిమాా వల్ల పిల్లలకు కుటుంబ బంధాల గురించి మరింత తెలుస్తుంది. తండ్రీకొడుకుల మధ్య ఉండే బాండింగ్ ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతుంది. ప...