భారతదేశం, డిసెంబర్ 27 -- క్రిస్మస్ వీకెండ్ (డిసెంబర్ 27-28) సందర్భంగా ఓటీటీలో సందడి చేయడానికి కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. హిందీలో బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హర్షవర్ధన్ రాణే సినిమా 'ఏక్ దీవానే కి దీవానియత్', తమిళ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మిడిల్ క్లాస్', తెలుగు మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా సహా కన్నడ, మలయాళ సినిమాలు ఇందులో ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలో రకరకాల జానర్స్ సందడి చేస్తున్నాయి. ఒకవైపు పిచ్చెక్కిించే ప్రేమకథ, మరోవైపు మిడిల్ క్లాస్ కష్టాలు, ఇంకోవైపు హారర్ థ్రిల్లర్స్.. ఇలా అన్నీ ఉన్నాయి. ఈ వీకెండ్ మీరు చూడదగ్గ టాప్ మూవీస్ ఇవే.

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా ఈవారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటే ఈ వీకె...