Hyderabad, మే 22 -- ఓటీటీలోకి ప్రతివారం వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. అలా ప్రస్తుతం ఐదు భాషలకు చెందిన ఐదు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగుతోపాటు మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషలకు చెందిన మూవీస్ ఇందులో ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

ఓటీటీలోకి గత వారం అడుగుపెట్టిన మూవీ అనగనగా. ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ సినిమా ఇది. సుమంత్ లీడ్ రోల్లో నటించాడు. మన విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ.. స్టూడెంట్స్ కు కథల రూపంలో పాఠాలు చెప్పడం వల్ల కలిగే ప్రయోజనాలను కళ్లకు కట్టే మూవీ ఇది. ఇందులో వ్యాస్ కుమార్ అనే టీచర్ పాత్రలో సుమంత్ నటించాడు. ఈ సినిమా, అతని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అంతటా పాజిటివ్ రివ్యూలు వస్తున్న ఈ మూవీని చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి.

మల...