Hyderabad, జూలై 28 -- ఓటీటీలోకి ఎప్పటిలాగే ఈ వారం కూడా అదిరిపోయే తొమ్మిది సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ తొమ్మిది ఇంట్రెస్టింగ్ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జోనర్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్‌లో రియాలిటీ సిరీస్‌గా వస్తోన్న డబ్ల్యూడబ్ల్యూఈ అన్‌రియల్‌లో ట్రిపుల్ హెచ్ నటించాడు. జూలై 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ అన్‌రియల్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 10 మంది డబ్ల్యూడబ్ల్యూఈ ఆటగాళ్లతో ఈ సిరీస్ సాగనుంది.

2019లో అత్యంత రహస్యంగా ఉన్న అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసిన నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ట్రైన్‌రెక్: స్టోర్మ్ ఏరియా 51. జూలై 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

70వ దశకంలో జరిగిన హత్యల నేపథ్యంలో తెరకెక్కిన రియల్ క్రైమ్ డ...