భారతదేశం, మే 3 -- మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి హీరోగా నటించిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా ఈ ఏడాది జనవరి 23వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మోస్తరుగా వసూళ్లు దక్కాయి. అయితే, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యమవుతోంది. నిరీక్షణ ఇంకా కొనసాగుతోంది.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ దగ్గర ఉన్నాయని సమాచారం. మార్చి 7నే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని రూమర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం అప్పుడు ఓటీటీలోకి రాలేదు. ఇంకా ఈ మూవీ స్ట్రీమింగ్ కోసం నిరీక్షణ సాగుతోంది.

డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై మళ్లీ రూమర్లు వస్తున్నా...