Hyderabad, సెప్టెంబర్ 30 -- మలయాళం ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్లు కాగా.. మరికొన్ని ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఆకట్టుకున్నాయి. అలాంటిదే తాజాగా ఓటీటీలోకి వచ్చిన మూవీ సర్కీట్ (Sarkeet). ఈ ఫ్యామిలీ డ్రామాకు థియేటర్లలో కంటే ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయిన తర్వాత సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

మలయాళ నటుడు ఆసిఫ్ అలీ కొత్త సినిమా 'సర్కీట్' సెప్టెంబర్ 26, 2025న మనోరమ మ్యాక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్న ఓ యువకుడికి, హైపర్‌యాక్టివ్ పిల్లాడికి మధ్య ఉన్న మనసుకు హత్తుకునే బంధాన్ని చూపించే సినిమా ఇది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి చాలా మంది ప్రేమను గెలుచుకుంది.

ముఖ్యంగా ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్‌ను చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది మర...