భారతదేశం, మే 26 -- ఈ మే చివరి వారంలో ఓటీటీల్లోకి అదిరిపోయే సినిమాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ముఖ్యంగా 5 చిత్రాలపై ఫోకస్ ఎక్కువగా ఉంది. నాని సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'హిట్ 3' స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. సూర్య హీరోగా నటించిన యాక్షన్ చిత్రం కూడా అడుగుపెట్టనుంది. ఓ కన్నడ చిత్రం, ఓ హాలీవుడ్ క్రేజీ మూవీ కూడా రానున్నాయి. ఇలా ఈ వారం ఓటీటీల్లోకి రానున్న 5 టాప్ సినిమాల గురించి ఇక్కడ చూడండి.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హిట్ 3' సినిమా మే 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎంట్రీ ఇవ్వనుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మే 1వ తేదీన థియేటర్లలో విడుదలైంది. రూ.100కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది. ఈ చిత్రంలో నాని...