భారతదేశం, జనవరి 7 -- ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్‌కి ఇది పెద్ద గుడ్ న్యూస్. బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపిన 'అఖండ 2: తాండవం' ఈ వారమే ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఈ శుక్రవారం (జనవరి 9) నుండి స్ట్రీమింగ్ కానున్న తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల పూర్తి లిస్ట్ ఇదే.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి మొదలవ్వక ముందే ఓటీటీలో సందడి మొదలైంది. బాలయ్య 'అఖండ 2' నుంచి కవిన్ నటించిన థ్రిల్లర్ 'మాస్క్' వరకు.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాల వివరాలు ఇక్కడ చూడండి.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అఖండ 2 మూవీ శుక్రవారం (జనవరి 9) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని అధికా...