భారతదేశం, నవంబర్ 23 -- ఓటీటీలో తెలుగు కంటెంట్ రోజు రోజుకీ బాగా విస్తరిస్తోంది. హారర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు ఎన్నో రకాల జోనర్లలో తెలుగు ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే, ప్రతి ఆదివారం సరికొత్త కథతో ఓటీటీ సినిమాను రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే ఇవాళ (నవంబర్ 23) ఆదివారం న్యూ కాన్సెప్ట్‌తో ఓ తెలుగు మూవీ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇప్పటివరకు ఇలా రొమాన్స్, హారర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో సినిమాలు వచ్చాయి. కానీ, ఈసారి హాలీవుడ్ స్టైల్‌లో సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చింది.

ఆ సినిమానే ఏఐ లవ్ స్టోరీ. తెలుగులో సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా ఏఐ లవ్ స్టోరీ సినిమా తెరకెక్కింది. హీరోను, హీరోయిన్ లవ్ చేస్తుంది. కానీ, హీరో మాత్రం మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తూ, లవ్ ట్రాక్ ...