Hyderabad, జూన్ 27 -- ఓటీటీలో మరో లేటెస్ట్ మూవీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో దంచికొడతాయని తెలిసిందే. అలా, మే 1న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన బాలీవుడ్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది.

ఆ సినిమానే రైడ్ 2. 2018లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రైడ్ సినిమాకు సీక్వెల్‌గా రైడ్ 2 తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా, రితేష్ దేశ్‌ముఖ్ విలన్‌గా ప్రధాన పాత్రలు పోషించిన రైడ్ 2 సినిమాకు రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించారు. అలాగే, ఈ సినిమాలో హాట్ బ్యూటీ వాణి కపూర్ హీరోయిన్‌గా చేసింది.

ఈ ముగ్గురితోపాటు రైడ్ 2 సినిమాలో సౌరభ్ శుక్లా, అమిత్ సియాల్, రజత్ కపూర్, సుప్రియ పాఠక్, శ్రుతి పాండే ఇతర కీలక పాత్రలు పోషించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ సాంగ్‌లో నర్తించ...