Hyderabad, ఏప్రిల్ 26 -- ఓటీటీలో ఎన్నో విభిన్న రకాల కంటెంట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో బోల్డ్ సినిమాలు సైతం ఉన్నాయి. అయితే, కేవలం శృంగారం, బోల్డ్, రొమాంటిక్ సీన్లు మాత్రమే కాకుండా మంచి మెసేజ్‌తో ఆహా అనిపించే ఐదు ఓటీటీ బోల్డ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి నేరుగా రిలీజ్ అయిన బోల్డ్ అండ్ రొమాంటిక్ చిత్రం గర్ల్స్ విల్ బీ గర్ల్స్. ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025కి గాను ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకున్న గర్ల్స్ విల్ బీ గర్ల్స్ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, హిందీ, ఇంగ్లీష్ తదితర భాషల్లో గర్ల్స్ విల్ బీ గర్ల్స్ ఓటీటీ రిలీజ్ అయింది.

మలయాళ పాపులర్ నటి కని కుశ్రుతి, ప్రీతి పాణిగ్రహి నటించిన ఈ సినిమాలో 16 ఏళ్ల కూతురికి కౌమార దశలో వచ్చి సెక్సువల్ ఫీలింగ్స్‌ ఆమె చదువులకు ఆటంకం కలగకూడదని పరితపించే తల్లి చుట్టూ ఈ సినిమా స...