Hyderabad, జూన్ 19 -- ఓటీటీలో ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు అలరిస్తుంటాయి. వాటిలో హారర్ థ్రిల్లర్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. హారర్ జోనర్స్‌కు అదనంగా ఫాంటసీ, అడ్వెంచర్, యాక్షన్, కామెడీ వంటి ఎలిమెంట్స్ యాడ్ చేసి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా మూవీస్ తెరకెక్కిస్తుంటారు.

అలా ఎన్నో సినిమాలు ఇప్పటికీ అలరించాయి. ఇలాంటి కోవలోకే చెందిన మరో హారర్ థ్రిల్లర్ మూవీ ది డీప్ డార్క్. ఒక బొగ్గు గనిలో వింత రాక్షసి నుంచి మనుషులు ప్రాణాలతో బయటపడతారా అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిందే ది డీప్ డార్క్. ఇది ఒక ఫ్రెంచ్ హారర్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా చిత్రం.

2023లో వచ్చిన ది డీప్ డార్క్ సినిమాకు మాథ్యూ టురి దర్శకత్వం వహించారు. ఫ్రెంచ్, అరబిక్ భాషల్లో 2023 ఆగస్ట్ 26న థియేటర్లలో విడుదల అయిన ది డీప్ డార్క్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింద...