భారతదేశం, ఆగస్టు 23 -- 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ సూపర్ హిట్ సిరీస్ తో మరో రేంజ్ కు వెళ్లిపోయిన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్. అక్కడి నుంచి వరుసగా బ్లాక్ బాస్టర్ సిరీస్ లు, సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. అనగనగా, ఏఐఆర్, కానిస్టేబుల్ కనకం.. ఇలా హ్యాట్రిక్ హిట్లు అందుకుంది ఈటీవీ విన్. ఇప్పుడు ఆడియన్స్ కు బంపరాఫర్ ప్రకటించింది.

ఓటీటీ ఆడియన్స్ కు ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటివరకూ ఈ ఓటీటీ వన్ మంత్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ రూ.99 గా ఉంది. కానీ ఒక వారం రోజుల పాటు వినోదోత్సవం పేరుతో ఈటీవీ విన్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.29కే ఒక నెల స‌బ్‌స్క్రిప్ష‌న్‌ ప్యాక్ ను ప్రకటించింది. రూ.99 స‌బ్‌స్క్రిప్ష‌న్‌ ప్యాక్ ను రూ.29కి తగ్గించింది. అది కూడా ఆగస్టు 23 నుంచి 29 వరకు మాత్రమే. అంటే ఒక వారం రోజుల్లోపు స‌బ్‌స్క్రిప్ష‌న్‌ తీసుక...