Hyderabad, ఆగస్టు 11 -- ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా మెచ్చి జోనర్లలో హారర్ థ్రిల్లర్ ఒకటి. రెగ్యులర్‌గా ఏదో ఒక సినిమా ఈ హారర్ జోనర్‌లో వస్తుంటుంది. ఆ హారర్ జోనర్ సినిమాలకు కామెడీ, యాక్షన్, అడ్వెంచర్, సైకలాజికల్, క్రైమ్ వంటి అంశాలను మిళితం చేసి కూడా తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు.

ఇక ఇటీవల వచ్చి బెస్ట్ అనిపించుకున్న హారర్ థ్రిల్లర్స్‌లలో జారన్ ఒకటి. ఇది ఒక మరాఠీ సినిమా. జారన్ అంటే మరాఠీలో చేతబడి అనే అర్థం వస్తుంది. రాధ అనే మహిళ కుటుంబం చేతబడికి గురవుతుంది. రాధ ఇంట్లో ఏమాత్రం ప్రశాంతత, సంతోషం లేకుండా బిక్కిబిక్కుమంటూ జీవిస్తుంది.

రాధకు భర్త, కుమార్తె ఉంటారు. రాధకు చిన్నప్పుడు కూడా చేతబడి జరుగుతుంది. చిన్నతనం నుంచే రాధ కుటుంబం చేతబడితో కొట్టుమిట్టాడుతుంటుంది. అసలు రాధకు ఎవరు చేతబడి చేస్తున్నారు?, ఆమె కుటుంబంపై ఎవరికి పగ ఉంది?, ఎందుకు ఉంది?,...