భారతదేశం, డిసెంబర్ 15 -- డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన రొమాంటిక్ మూవీ ఆరోమలే ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్. తమిళ ఒరిజినల్ ఫిల్మ్ అయిన ఆరోమలే ఓటీటీ స్ట్రీమింగ్ లో తెలుగులోనూ సత్తాచాటుతోంది.

తమిళ రొమాంటిక్ లవ్ స్టోరీ ఆరోమలే ఓటీటీలో రాణిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 12న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది. ఓటీటీ డెబ్యూలో ఆరోమలే సినిమా సత్తాచాటుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఆరోమలే మూవీ. దీనికి దర్శకుడు సారంగ్ తియాగు. కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జోడీగా నటించారు.

ఆరోమలే సినిమా జియోహాట్‌స్టార్‌లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మూవీకి డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ జై కొడుతున్నారు. ఈ చిత్రం ఓటీటీలో అయిద...