భారతదేశం, అక్టోబర్ 4 -- తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ 'మదరాసి' ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు టాప్-5లో ఏయే చిత్రాలు ఉన్నాయో ఓ లుక్కేయండి.

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మదరాసి ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ఓటీటీని షేక్ చేస్తోంది. శివ కార్తీకేయన్, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ డైరెక్టర్. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 1న ఓటీటీలో రిలీజైంది.

బాధలో ఉన్న అందరూ తన బంధువులే అనుకుని ఫీల్ అయ్యే మానసిక వ్యాధి హీరోకు ఉంటుంది. లవర్ వదిలేయడంతో చనిపోవాలనుకుంటాడు. కానీ అక్రమ ఆయుధాలను ధ...