భారతదేశం, డిసెంబర్ 7 -- ఓటీటీలో హారర్ థ్రిల్లర్లు ఎప్పుడూ అదరగొడుతూనే ఉంటాయి. ఈ జోనర్లో వచ్చే సినిమాలకు డిజిటల్ స్ట్రీమింగ్ లో మంచి ఆదరణ దక్కుతుంటుంది. వారం వారం కొత్త హారర్ థ్రిల్లర్లు ఓటీటీలోకి వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా వచ్చాయి. ఇందులో ఈ మూడు హారర్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ లతో వచ్చిన ఈ మూవీస్ ఏంటో చూసేయండి.

రష్మిక మందన్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'థామా' ఓటీటీలో అదరగొడుతోంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 2న రిలీజైంది. ఇందులో రక్త పిశాచి బేతాళిగా రష్మిక మందన్న నటించింది. థామాలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు కూడా యాక్ట్ చేశారు.

ఒకసారి జర్నలిస్ట్ అయిన హీరో న్యూస్ కవరేజీ కోసం పర్వత ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అతనిపై ఎలుగు బంటి దాడి చేస్తోంది. దాని నుంచి తడ్క...